breaking news
HDFC net profit
-
హెచ్డీఎఫ్సీ నికర లాభం రూ. 2,107 కోట్లు
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 2 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ2లో రూ.2,064 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.2,107 కోట్లకు ఎగసిందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.11,608 కోట్ల నుంచి రూ.12,521 కోట్లకు పెరిగిందని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిస్త్రీ చెప్పారు. జీవిత బీమా వ్యాపారం జోరు కారణంగా నికర లాభంలో వృద్ధి సాధించామని వివరించారు. స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.1,358 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.1,605 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.6,671 కోట్ల నుంచి రూ.7,480 కోట్లకు ఎగసిందని తెలిపారు. వచ్చే ఏడాది హెచ్డీఎఫ్సీ లైఫ్ ఐపీఓ గత క్యూ2లో రూ.184 కోట్లుగా ఉన్న జీవీత బీమా వ్యాపార విభాగం నికర లాభం రూ.215 కోట్లకు వృద్ధి చెందిందని మిస్త్రీ వివరించారు. సాధారణ బీమా వ్యాపార నికర లాభం రూ.36 కోట్ల నుంచి రూ.61 కోట్లకు పెరిగిందని, రూ.719 కోట్లు పన్నుల కోసం కేటాయించామని చెప్పారు. నికర వడ్డీ మార్జిన్ 4% నుంచి 3.95 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం (డివిడెండ్‌తో కలుపుకొని) రూ.2,059 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.2,501 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డివిడెండ్ కారణంగా నికర వడ్డీ ఆదాయం పెరిగిందని వివరించారు. స్థూల మొండి బకాయిలు 0.71%గా ఉన్నాయని, వ్యక్తుల మొండి బకాయిలు 0.53 %గా, సంస్థల మొండి బకాయిలు 1.12 %గా ఉన్నాయని తెలిపారు. లోన్‌బుక్ రూ.2,12,344కోట్ల నుంచి రూ.2,37,991 కోట్లకు పెరిగిందని వివరించారు. ఏడాది కాలంలో రూ.12,969 కోట్ల రుణాలు విక్రయించామని తెలిపారు. విదేశాల్లో రూపీ బాండ్ల ద్వారా 75 కోట్ల డాలర్ల నిధులు సమీకరించడానికి వాటాదారుల ఆమోదం పొందామని తెలిపారు. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఐపీఓ వచ్చే ఏడాది మధ్యన ఉండొచ్చని తెలిపారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 2 శాతం నష్టంతో రూ.1,313 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ ఫలితాలు ఓకే
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ ఫలితాలు ఫర్వాలేదనిపించాయి. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో 13.5% అధికంగా రూ. 1,935 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలానికి రూ. 1,706 కోట్లను ఆర్జించింది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17% ఎగసి రూ. 1,905 కోట్లను చేరినప్పటికీ, పెట్టుబడుల విక్రయంపై లభించే ఆదాయం తగ్గడంతో లాభాలు పరిమితమైనట్లు కంపెనీ వైస్‌చైర్మన్ కేకి మిస్త్రీ చెప్పారు. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ. 8,873 కోట్ల నుంచి రూ. 10,053 కోట్లకు చేరింది. పెట్టుబడుల విక్రయం ద్వారా లభించే లాభం, డివిడెండ్ల వంటివి రూ. 141.5 కోట్ల నుంచి రూ. 111 కోట్లకు తగ్గాయి. సబ్సిడరీలు మినహాయిస్తే (స్టాండెలోన్ ప్రాతిపదికన) క్యూ3లో కంపెనీ నికర లాభం 12% పుంజుకుని రూ. 1,278 కోట్లను తాకితే, ఆదాయం రూ. 5,250 కోట్ల నుంచి రూ. 6,020 కోట్లకు ఎగసింది. మొండిబకాయిలు, తదితరాలకు రూ. 466 కోట్లను అదనంగా కేటాయించడంతో ఇవి క్యూ3లో రూ. 1,357 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఈ నెలాఖరులో చేపట్టనున్న పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించవచ్చునని, ఏప్రిల్ తరువాతే రేట్లలో తగ్గింపునకు అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బుధవారం షేరు ధర స్వల్పంగా 0.6 శాతం లాభపడి రూ. 842 వద్ద ముగిసింది.