మొబైల్‌ కనెక్షన్లకు ఆధార్‌ ఈ–కేవైసీ వాడొద్దు | Govt Asks Telcos to Stop Using Aadhaar eKYC for Verifying Users | Sakshi
Sakshi News home page

మొబైల్‌ కనెక్షన్లకు ఆధార్‌ ఈ–కేవైసీ వాడొద్దు

Oct 27 2018 1:43 AM | Updated on Oct 27 2018 1:43 AM

Govt Asks Telcos to Stop Using Aadhaar eKYC for Verifying Users - Sakshi

న్యూఢిల్లీ: పాత, కొత్త మొబైల్‌ కనెక్షన్లకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ విధానంలో యూజర్ల గుర్తింపు, చిరునామాల ధృవీకరణ కోసం (ఈ–కేవైసీ) ఆధార్‌ను ఉపయోగించరాదంటూ టెలికం సంస్థలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారు స్వచ్ఛందంగా ఇచ్చిన పక్షంలో కేవైసీ కోసం పేపరు రూపంలోని ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. ఈ నిబంధనల అమలుపై నవంబర్‌ 5లోగా నివేదిక ఇవ్వాలని టెలికం శాఖ శుక్రవారం ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రైవేట్‌ సంస్థలు ఆధార్‌ను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో టెలికం శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement