శాంసంగ్‌ మాన్‌స్టర్‌ గెలాక్సీ ఎం21 లాంఛ్‌ | Government Decided To Issue All The Pending Income Tax Refunds | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ మాన్‌స్టర్‌ గెలాక్సీ ఎం21 లాంఛ్‌

Apr 8 2020 8:30 PM | Updated on Apr 8 2020 8:52 PM

Government Decided To Issue All The Pending Income Tax Refunds - Sakshi

శాంసంగ్‌ ఎం21 లాంఛ్‌

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ భారత మార్కెట్‌లో వాటామాన్‌స్టర్‌ గెలాక్సీ ఎం21 స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్‌ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ 6000ఎంఏహెచ్‌ బ్యాటరీ, శక్తివంతమైన 48 ఎంపీ రియర్‌ కెమెరా, యువ మిలీనియల్స్‌ను ఆకట్టుకునేలా సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎం21 ప్రధాన ఆకర్షణగా 6000ఎంఏహెచ్‌ బ్యాటరీతో రోజంతా నిలిచి ఉంటుంది. గెలాక్సీ ఎం 21 హెచ్‌డీ డిస్‌ప్లేతో అందుబాటులోకి రావడంతో వినియోగదారులకు మెరుగైన స్క్రీన్‌ అనుభవాన్ని అందిస్తుంది.

భిన్న లైటింగ్‌ పరిస్ధితుల్లోనూ ఇమేజ్‌లను తీసుకునేందుకు, శక్తివంతమైన ట్రిపుల్‌ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. గెలాక్సీ ఎం21 అత్యుత్తమ ఎం సిరీస్‌కు ప్రాతినిధ్యం వహిస్తోందని ఇది శక్తివంతమైన బ్యాటరీ, గొప్ప కెమెరాలు, అద్భుతమైన స్క్రీన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిందని శామ్‌సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ వార్సీ పేర్కొన్నారు. మార్చి 23 నుండి మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ మోడళ్లలో గెలాక్సీ ఎం21 4/64 జీబీ 13,499 రూపాయలకు, 6/128 జీబీ మెమరీ వేరియంట్‌కు 15,499 రూపాయలకు లభిస్తుంది.

చదవండి : రూ.70 వేల శాంసంగ్‌ ఫోన్‌ రూ. 25 వేలకే


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement