స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేసింది: ధర ఎంతంటే? | Skoda Kushaq Facelift Launched Know The Details Here | Sakshi
Sakshi News home page

స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేసింది: ధర ఎంతంటే?

Mar 22 2026 5:26 PM | Updated on Mar 22 2026 5:55 PM

Skoda Kushaq Facelift Launched Know The Details Here

స్కోడా కంపెనీ.. అప్‌డేటెడ్ కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ లేటెస్ట్ మిడ్-సైజ్ ఎస్యూవీ డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లలో గణనీయమైన అప్‌గ్రేడ్‌లను పొందింది. అదే సమయంలో కంపెనీ సేఫ్టీకి కూడా ప్రాధాన్యత కల్పించింది.

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే.. కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌.. క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో అనే ఐదు ట్రిమ్‌లలో 1.0 TSI, 1.5 TSI టర్బో పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తుంది.

కుషాక్ ఫేస్‌లిఫ్ట్ 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌ కూడా పొందింది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ మౌంట్‌లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

మెకానికల్ పరంగా.. అతిపెద్ద అప్‌డేట్ ఏమిటంటే, మునుపటి 6-స్పీడ్ యూనిట్ స్థానంలో 1.0-లీటర్ TSI ఇంజిన్‌తో కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టడం. ఈ ఇంజిన్ 115bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. 1.5-లీటర్ TSI ఇంజన్ 147bhp, 250Nm టార్క్ అందిస్తుంది. దీనికి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యూనిట్ ఉంటుంది. మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఇప్పుడు దీనికి వెనుక డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement