ఫేసుబుక్‌ గూటికి టాప్‌ ఎగ్జిక్యూటివ్‌

ఫేసుబుక్‌ గూటికి  టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ - Sakshi


న్యూయార్క్‌: ఉబెర్‌ మాజీ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు  ఫేస్‌ బుక్‌ గూటికి  చేరారు.   ఉబెర్‌  మాజీ పీఆర్‌  చీఫ్‌ రాచెల్‌ వెట్‌స్టోన్‌ను  ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షులుగా నియమించుకుంది. తన  ప్రధాన  సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్, ఇన్‌స్టాగ్రామ్ లకు బ్రిటన్‌  పీఆర్‌ గురుగా పేరొందిన వెట్‌స్టోన్‌ను ఎంపిక చేసింది. 


ఉబెర్లో మాజీ ఉన్నత ప్రజా సంబంధాల అధికారిగా ఉన్న రాచెల్‌ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టా‍గ్రామ్, వాట్స్ఆప్ ,  మెసెంజర్‌కు కమ్యూనికేషన్ల వైస్ ప్రెసిడెంట్‌గా చేరినట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. ఫేస్‌బుక్‌ ఫ్యామిలీలో చేరడం తనకు గౌరవమని వెట్‌స్టోన్‌ సంతోషం వ్యక్తం చేశారు.  తన సొంత కుటుంబం, స్నేహితులతో సన్నిహితంగా ఉండటం సులభమైందని తద్వారా వాట్సాప్‌   తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందనీ  ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

 

ఇప్పటికే ప్రపంచ స్థాయి జట్టును లీడ్‌ చేసిన రాచెల్‌ నుంచి ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన సమాచార అవకాశాలను నిర్వహించే క్రమంలో తాము మరిన్ని విషయాలను తెలుసుకునే అవకాశం కలగినందుకు సంతోషిస్తున్నామని ఫేస్‌బుక్‌ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ కమ్యూనికేషన్స్) కారిన్ మారోనీ  అన్నారు.


కాగా బ్రిటన్ అత్యంత శక్తివంతమైన కన్జర్వేటివ్ రాజకీయ నాయకులకు పనిచేసిన వెట్ స్టోన్ కార్పొరేట్‌ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్లో ఉబెర్‌కు రాజీనామా చేశారు.  అంతకుముందు  గూగుల్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ పబ్లిక్ పాలసీ హెడ్‌గా  పనిచేశారు.  అంతేకాదు ఆమె డేవిడ్ కామెరాన్ , జార్జ్ ఒస్బోర్న్ లకు స్నేహితురాలు. అలాగే హోవార్డ్‌కి రాజకీయ కార్యదర్శిగా టోనీ బ్లెయిర్ లేబర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కన్జర్వేటివ్ రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించారు.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top