ఇమామి చేతికి కేశ్‌కింగ్ | Emami continues buying spree, acquires Kesh King brand | Sakshi
Sakshi News home page

ఇమామి చేతికి కేశ్‌కింగ్

Jun 3 2015 12:55 AM | Updated on Oct 2 2018 8:16 PM

ఇమామి చేతికి కేశ్‌కింగ్ - Sakshi

ఇమామి చేతికి కేశ్‌కింగ్

హెయిర్, స్కాల్ప్‌కేర్ బ్రాండ్ కేశ్‌కింగ్‌ను రూ.1,651 కోట్లకు ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఇమామి కొనుగోలు చేసింది.

డీల్ విలువ రూ.1,651 కోట్లు
న్యూఢిల్లీ: హెయిర్, స్కాల్ప్‌కేర్ బ్రాండ్ కేశ్‌కింగ్‌ను రూ.1,651 కోట్లకు ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఇమామి కొనుగోలు చేసింది. కేశ్‌కింగ్ కొనుగోలుతో ఆయుర్వేద హెయిర్, స్కాల్ప్‌కేర్ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నామని ఇమామి డెరైక్టర్ హర్ష వి.అగర్వాల్ చెప్పారు. తమ వృద్ధి వ్యూహంలో భాగంగా కేశ్‌కింగ్‌ను కొనుగోలు చేశామని పేర్కొన్నారు.

ఈ బ్రాండ్ కొనుగోలుకు అవసరమైన నిధులను తమ వద్ద మిగులుగా ఉన్న నగదు నిల్వలు, స్వల్ప, దీర్ఘకాలిక రుణాల ద్వారా ఒక నెలలోపు సమీకరిస్తామని కంపెనీ సీఈఓ (ఫైనాన్స్, స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్‌మెంట్) ఎన్, హెచ్ భన్సాలి చెప్పారు. కొత్త కేటగిరీల్లోకి ప్రవేశించడానికి ఇమామి, దేశీ యంగా, అంతర్జాతీయంగా బ్రాండ్లను కొనుగోలు చేస్తోంది.

కేశ్‌కింగ్ బ్రాండ్‌ను 2009లో సంజీవ్ జునేజా మార్కెట్లోకి తెచ్చారు. ఈ బ్రాండ్‌కింద తల నూనె, హెర్బల్ షాంపూ, కండీషనర్, ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్‌ను అందిస్తున్నారు. కేశ్‌కింగ్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల టర్నోవర్‌ను సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement