ఎలాన్‌ మస్క్‌కు భారీ షాక్‌.. 2 నిమిషాల్లో..

Elon Musk Loses Huge Amount In Two Minutes As Tesla Shares Tumble - Sakshi

వాషింగ్టన్‌ : ఎలక్ట్రిక్‌ కార్ల సంచలనం టెస్లా సీఈవో, స్పేస్‌ఎక్స్‌ ఫౌండర్‌ ఎలాన్ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. న్యూయార్క్‌ ట్రేడింగ్‌ ప్రారంభమైన రెండు నిమిషాల టెస్లా కంపెనీ షేర్లు 11 శాతం మేర పడిపోయాయి. ఈ క్రమంలో ఎలన్‌ మస్క్‌ 1.1 బిలియన్‌(సుమారు 69,18,75,00,000 రూపాయలు) డాలర్ల సంపద ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన నికర సంపద 22.3 బిలియన్‌ డాలర్లకు చేరిందని అని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక పేర్కొంది. కాగా ఈ ఏడాది ఆర్థిక సంత్సరం మొదటి త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. గతేడాది నాలుగవ త్రైమాసికంలో 90, 966లుగా ఉన్న టెస్లా కార్ల అమ్మకాలు ప్రస్తుతం 63,000లకు పడిపోవడంతోనే కంపెనీ షేర్లు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది.

ఇక ఎలన్‌ మస్క్‌.. స్పేస్‌ఎక్స్‌ ద్వారా 10 బిలియన్‌ డాలర్లు, టెస్లా సీఈఓగా 13 బిలియన్‌ డాలర్ల సంపద ఆర్జించినట్టు పలు ర్యాంకింగ్‌ సంస్థలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా టెస్లా షేర్లను ఒక్కొక్కటి 420 డాలర్లకు కొనుగోలు చేస్తానని, దానికి తగ్గ నిధులున్నాయని ఈ ఏడాది ఆగస్టు 7న ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేసిన ఎలన్‌ మస్క్‌ టెస్లా చైర్మన్‌ పదవిని పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త చైర్‌పర్సన్‌గా రాబిన్‌ డెన్‌హోమ్‌(55)ను నియమితులు కాగా మస్క్‌ సీఈఓ పదవికి పరిమితమయ్యారు. మరోవైపు స్పేస్‌ ఎక్స్‌ (స్పెస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్‌‌) ఇటీవలే అత్యంత శక్తివంతమైన మానవ రహిత రాకెట్‌ను ప్రయోగాత్మకంగా లాంచ్‌ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top