పీఎన్‌బీ స్కాం : నీరవ్‌కు మరో ఎదురు దెబ్బ | ED AttachesAssets Worth Rs 147 crore of Nirav Modi | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాం : నీరవ్‌కు మరో ఎదురు దెబ్బ

Feb 26 2019 2:05 PM | Updated on Feb 26 2019 2:11 PM

ED AttachesAssets Worth Rs 147 crore of Nirav Modi - Sakshi

సాక్షి, ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలోప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి ఈడీ మరోసారి ఝలక్‌ ఇచ్చింది. రూ. 148 కోట్ల విలువైన ఆస్తులను మంగళవారం  అటాచ్‌ చేసింది. ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెట్‌కు 147.72 కోట్ల రూపాయల విలువైన  ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రూ.50కోట్ల విలువైన అమృతా షెర్-గిల్, ఎం.ఎఫ్ హుస్సేన్ లాంటి ప్రముఖ కళాకారుల పెయింటింగ్స్‌  ఇందులో ఉన్నాయి. మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఏ) కింద ఈడీ ఈ చర్య చేపట్టింది. మోదీ అతని కంపెనీలకు చెందిన ఎనిమిది కార్లు, ప్లాంట్,  మెషీన్లు, బంగారు ఆభరణాలు, పెయింటింగ్స్‌తోపాటు ఇతర స్థిరమైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ విదేశాల్లో  నీరవ్‌కు చెందిన 1725 కోట్ల రూపాయల ఆస్తులను ఇప్పటికే ఈడీ ఎటాచ్‌  చేసింది.

కాగా  రూ.14వేల కోట్ల రూపాయల పీఎన్‌బీ స్కాంలో నీరవ్‌మోదీతోపాటు, ఆయన మేనమామ గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్‌ చోక్సీ  ప్రధానంగా నిందితులుగా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కేసులు నమోదు చేశాయి. వేలకోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడి  విదేశాలకు చెక్కేసిన నీరవ్‌, చోక్సీలను తిరిగి స్వదేశానికి  రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement