కంపెనీలకు సైబర్‌ దాడుల ముప్పు | Companies more prone to cyber attack; 60% software unregulated: EY | Sakshi
Sakshi News home page

కంపెనీలకు సైబర్‌ దాడుల ముప్పు

Jun 12 2017 2:46 AM | Updated on Sep 5 2017 1:22 PM

కంపెనీలకు సైబర్‌ దాడుల ముప్పు

కంపెనీలకు సైబర్‌ దాడుల ముప్పు

దేశంలో చాలా కంపెనీ లకు సైబర్‌ దాడుల ముప్పు పొంచి ఉందని ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్‌ (ఈవై) హెచ్చరించింది. కంపె నీలు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌

60 % సాఫ్ట్‌వేర్‌లు భద్రత లేనివే: ఈవై
ముంబై: దేశంలో చాలా కంపెనీ లకు సైబర్‌ దాడుల ముప్పు పొంచి ఉందని ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్‌ (ఈవై) హెచ్చరించింది. కంపె నీలు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లలో 60 శాతానికి పైగా నియంత్రణలకు అనువైనవి కావని (లైసెన్స్‌డ్‌ కానివి), వీటితో దాడులకు అవకాశం ఉందని తెలిపింది.  ‘‘చాలా సంస్థలు హార్డ్‌వేర్‌ పరంగా భద్రతా చర్యలు తీసుకున్నాయి. కానీ, వాడే సాఫ్ట్‌వేర్‌ పట్ల అంత శ్రద్ధ చూపించలేదు.

ఈ సాఫ్ట్‌వేర్‌లు నియంత్రణలకు అనువైనవి కావు’’అని ఈవై పార్ట్‌నర్‌ మాయ రామచంద్రన్‌ తెలిపారు. ఈవై ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో 49 శాతం మంది భద్రతా అధికారులు లైసెన్స్‌ లేని సాఫ్ట్‌వేర్‌ల వల్ల మాల్వేర్‌ల దాడి పొంచి ఉందని తెలిపారు. 26 శాతం ఉద్యోగులు తమ కార్యాలయ కంప్యూటర్లలో లైసెన్స్‌లేని బయటి సాఫ్ట్‌వేర్‌లను వినియోగించినట్టు చెప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement