సెల్కాన్ నుంచి డైమండ్ క్యూ4జీ | Celkon launches Diamond Q4G Plus | Sakshi
Sakshi News home page

సెల్కాన్ నుంచి డైమండ్ క్యూ4జీ

Apr 27 2016 12:42 AM | Updated on Sep 3 2017 10:49 PM

సెల్కాన్ నుంచి డైమండ్ క్యూ4జీ

సెల్కాన్ నుంచి డైమండ్ క్యూ4జీ

మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న సెల్‌కాన్ 4జీ మోడళ్ల సంఖ్యను పెంచుతోంది.

ధర రూ.5,249
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న సెల్‌కాన్ 4జీ మోడళ్ల సంఖ్యను పెంచుతోంది. తాజాగా డైమండ్ సిరీస్‌లో డ్యూయల్ సిమ్‌తో కూడిన క్యూ4జీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ధర రూ.5,249. ఎల్‌టీఈ 1,800/850 మెగాహెట్జ్ ఎఫ్‌డీడీ, 2,300 మెగాహెట్జ్ టీడీడీ బ్యాండ్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఐపీఎస్ డిస్‌ప్లేతో 4.5 అంగుళాల స్క్రీన్, ఆన్‌డ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్, 1 జీబీ డీడీఆర్3 ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీతో రూపొందించారు.

1,800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్, ఆటోఫోకస్‌తో 5 ఎంపీ కెమెరా, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ ఇతర ఫీచర్లు. బ్యాక్ కేస్ ఉచితం. మొబైల్ ఫోన్ల రంగంలో భవిష్యత్ 4జీ ఎల్‌టీఈ మోడళ్లదేనని సెల్‌కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రవేశపెట్టిన 4జీ ట్యాబ్లెట్ సిరీస్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందని వివరించారు. మరిన్ని 4జీ ఎల్‌టీఈ ఆధారిత మోడళ్లను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement