ఆధార్‌ లేని పాన్‌ కార్డులు పనికొస్తాయా? | CBDT: PAN without Aadhaar is valid | Sakshi
Sakshi News home page

ఆధార్‌ లేని పాన్‌ కార్డులు పనికొస్తాయా?

Jun 30 2017 1:27 PM | Updated on Sep 5 2017 2:52 PM

ఆధార్‌ లేని పాన్‌ కార్డులు పనికొస్తాయా?

ఆధార్‌ లేని పాన్‌ కార్డులు పనికొస్తాయా?

పాన్‌ కార్డును ఆధార్‌తో రేపటి వరకు లింక్‌ చేసుకోవాలని, లేకపోతే పాన్‌ కార్డు పనికి రాకుండా పోతుందంటూ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి.

న్యూఢిల్లీ :  పాన్‌ కార్డును ఆధార్‌తో రేపటి వరకు లింక్‌ చేసుకోవాలని, లేకపోతే పాన్‌ కార్డు పనికి రాకుండా పోతుందంటూ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. ఈ ఊహాగానాలన్నింటిని ఆదాయపు పన్ను శాఖ  కొట్టిపారేసింది. ఆధార్‌తో లింక్‌ చేసుకోని  పాన్‌ కార్డులను రద్దు చేయమని ఆదాయపు పన్ను శాఖ స్పష్టంచేసింది. బుధవారం జారీచేసిన నోటిఫికేషన్‌లో  ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.'' ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిసవసరం లేదు. జూన్‌ 30 తర్వాత పాన్‌ పనికి రాకుండా పోదు'' అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ సుశిల్‌ చంద్రా చెప్పారు.
 
ఆధార్‌తో లింకులేని పాన్‌లు  ఎప్పుడు పనికిరాకుండా పోతాయో ఆ తేదీలను బోర్డు తర్వాత నోటిఫై చేస్తుందని తెలిపారు. 2017 జూలై వరకు ఎవరైతే పాన్‌ కార్డును కలిగి ఉంటారో, వారందందరూ సెక్షన్‌ 139ఏఏ సబ్‌-సెక్షన్‌ 2 ప్రొవిజన్స్‌ కింద ఆధార్‌ నెంబర్‌ను పాన్‌కార్డులకు లింక్‌ చేసుకోవాలని ఈ వారంలో మొదట్లోనే ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేసుకునే ప్రక్రియకు చివరి తేదీగా జూన్‌ 30ను నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేసుకునే ప్రక్రియలో ప్రజలందరూ నిమగ్నమై పోయారు. ఒకవేళ ఈ ప్రక్రియ జూన్‌ 30కి ముగియకపోతే, పాన్‌ కార్డులు పనికి రాకుండా పోతాయని ప్రజల్లో భయాందోళన చెలరేగింది. కానీ ఆధార్‌తో లింక్‌ లేకపోయినప్పటికీ పాన్‌ కార్డులు పనికి వస్తాయని తాజాగా సీబీడీటీ స్పష్టంచేసింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement