విమానయాన షేర్లు లాభాల టేకాఫ్‌ | Sakshi
Sakshi News home page

విమానయాన షేర్లు లాభాల టేకాఫ్‌

Published Thu, May 21 2020 10:31 AM

aviation stocks in focus - Sakshi

దేశీయ విమానయాన కంపెనీల షేర్లు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. లాక్‌డౌన్‌తో దాదాపు 2నెలల విరామం తర్వాత సోమవారం (మే 25) నుంచి దేశీయ విమాన సర్వీసులను నడపనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఏవియేషన్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ రంగానికి చెందిన ఇండిగో, స్పైస్‌ జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, గ్లోబల్‌ వెక్టా హెలీకార్పో లిమిటెడ్‌ కంపెనీల షేర్లు 11శాతం నుంచి 8శాతం లాభపడ్డాయి. 

కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ బుధవారం కీలక ప్రకటన చేశారు. దేశంలో 2,3 నెలలుగా నిలిచిపోయిన దేశీయ (డొమెస్టిక్) విమానాలు మే 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని ఈయన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. 

అయితే, కచ్చితమైన నిబంధనలను, ఆంక్షలను విమానాశ్రాయాల్లోను, విమానాల్లోను తప్పకుండా పాటించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధివిధానాలను విమానయాన శాఖ వెల్లడిస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.


షేర్ల ధరల జోరు...

ఇండిగో షేరు: నేడు బీఎస్‌ఈలో రూ.1002.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం 10గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.911.90)తో పోలిస్తే 8శాతం లాభంతో రూ.986.50 వద్ద ‍ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.765.05, రూ.1911.00గా ఉన్నాయి.

స్పైస్‌ జెట్‌ షేరు: నేడు బీఎస్‌ఈలో 5శాతం లాభంతో రూ.42.95 వద్ద ప్రారంభమైన అదే ధర వద్ద అప్పర్‌ సర్కూ‍్యట్‌ను తాకి ఫ్రీజ్‌ అయ్యింది. 

జెట్‌ ఎయిర్‌వేస్‌: నేడు బీఎస్‌ఈలో రూ.19.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం 10గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.911.90)తో పోలిస్తే 4.91శాతం లాభంతో రూ.20.30 వద్ద ‍ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.13, రూ.164.90గా ఉన్నాయి.

Advertisement
Advertisement