హిందుస్తాన్‌ జింక్‌ స్పెషల్‌ డివిడెండ్‌ 13,985 కోట్లు | At ₹27157 crore, Hindustan Zinc's total dividend payout is largest this fiscal year | Sakshi
Sakshi News home page

హిందుస్తాన్‌ జింక్‌ స్పెషల్‌ డివిడెండ్‌ 13,985 కోట్లు

Mar 23 2017 12:31 AM | Updated on Sep 5 2017 6:48 AM

హిందుస్తాన్‌ జింక్‌ స్పెషల్‌ డివిడెండ్‌ 13,985 కోట్లు

హిందుస్తాన్‌ జింక్‌ స్పెషల్‌ డివిడెండ్‌ 13,985 కోట్లు

వేదాంత గ్రూ ప్‌నకు చెందిన హిందుస్తాన్‌ జింక్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13,985 కోట్ల ప్రత్యేకమైన వన్‌ టైమ్‌ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

రికార్డు తేదీ ఈ నెల 30
ఈ ఏడాది మొత్తం 27,157 కోట్లు
ఏడాదిలో ఇంత భారీ డివిడెండ్‌ ఇచ్చిన కంపెనీ ఇదే  


న్యూఢిల్లీ: వేదాంత గ్రూ ప్‌నకు చెందిన హిందుస్తాన్‌  జింక్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13,985 కోట్ల ప్రత్యేకమైన వన్‌ టైమ్‌ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.27.50 (1,375 శాతం) చొప్పున ఈ డివిడెండ్‌ను చెల్లించాలని బుధవారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం నిర్ణయించిందని హిందుస్తాన్‌ జింక్‌  పేర్కొంది. ఈ డివిడెండ్‌కు రికార్డ్‌ తేదీగా ఈ నెల 30ని నిర్ణయించామని కంపెనీ చైర్మన్‌ అగ్నివేశ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది ఏప్రిల్‌లో గోల్డెన్‌ జూబ్లీ డివిడెండ్‌ను చెల్లించాం. తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించాం.

ఇప్పుడు స్పెషల్‌ వన్‌ టైమ్‌ మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించాం. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మేం చెల్లించే మొత్తం డివిడెండ్‌ రూ.27,157 కోట్లకు (డీడీటీ–డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ను కూడా కలుపుకొని) చేరుతుంది. ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఏ కంపెనీ కూడా ఈ స్థాయిలో డివిడెండ్‌ చెల్లించలేదు’’ అని వివరించారు. తమ  కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉన్నందున రూ.11,259 కోట్లు దక్కుతాయని పేర్కొన్నారు. 2002లో ఈ కంపెనీని ప్రభుత్వం విక్రయించిందని, అప్పటి నుంచి డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ను కూడా కలుపుకుంటే తాము రూ.37,517 కోట్ల డివిడెండ్‌ను చెల్లించామని తెలిపారు. ఈ కంపెనీ వెండి, జింక్, సీసం లోహాలను ఉత్పత్తి చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement