ఐఫోన్‌ ధరలు తగ్గాయ్‌ | Apple slashes iPhone, iPad Mac prices upto 7.2% in India | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ ధరలు తగ్గాయ్‌

Jul 3 2017 3:39 AM | Updated on Sep 5 2017 3:02 PM

టెక్నాలజీ దిగ్గజం తన ఉత్పత్తులు ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌ ధరల్ని తగ్గించింది. ఐఫోన్ల పాతధరలతో పోలిస్తే వివిధ మోడల్స్‌పై 7.2 శాతం వరకూ దరలు తగ్గాయి.

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం తన ఉత్పత్తులు ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌ ధరల్ని తగ్గించింది. ఐఫోన్ల పాతధరలతో పోలిస్తే వివిధ మోడల్స్‌పై 7.2 శాతం వరకూ దరలు తగ్గాయి. ఐఫోన్‌ 7ప్లస్‌ (256 జీబీ) ప్రస్తుతం రూ. 85,400కు లభిస్తుంది. దీని పాత ధర రూ. 92,000. అలాగే ఐఫోన్‌ ఎస్‌ఈ (128 జీబీ) ధర రూ. 2,200 తగ్గుదలతో రూ. 35,000కు దిగింది. జూలై 1 నుంచి ధరల్ని తగ్గిస్తూ..కొత్త ధరల్ని కంపెనీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. జీఎస్‌టీ కారణంగానే ధరలు తగ్గించారా..అంటూ కంపెనీని వివరణ కోరగా, వ్యాఖ్యానించేందుకు యాపిల్‌ నిరాకరించింది. 12.9 అంగుళాల ఐప్యాడ్‌ ప్రొ (512 జీబీ) ధర రూ. లక్ష నుంచి రూ. 97,000కు కట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement