‘తాలిబన్లుగా మారకూడదు’ | Anand Mahindra On Godse Controversy | Sakshi
Sakshi News home page

‘తాలిబన్లుగా మారకూడదు’

May 17 2019 2:52 PM | Updated on May 17 2019 3:56 PM

Anand Mahindra On Godse Controversy - Sakshi

ముంబై : నాథురామ్‌ గాడ్సేని దేశభక్తుడంటూ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలన్ని సాధ్వి వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మహీంద్ర గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్ర కూడా ఈ అంశంపై స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మన విలువల్ని మనమే నాశనం చేసుకుని తాలిబన్లుగా మారకూడదంటూ హితవు పలికారు.

‘75 ఏళ్లుగా ప్రపంచం, భారతదేశాన్ని మహాత్ముడి జన్మభూమిగానే గుర్తిస్తుంది. ప్రపంచం నైతికతను కొల్పోయినప్పుడు మన దేశమే ముందుండి దారి చూపిస్తుంది. ప్రపంచం అంతా మనల్ని పేదవారిగా చూస్తారు. కానీ బాపు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలిచి మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేశారు. కొన్ని విషయాలు పవిత్రంగానే ఉండాలి. మనకోసం మనం ఏర్పాటు చేసుకున్న విలువల్ని మనమే నాశనం చేసుకుని తాలిబన్లుగా మారకూడదు’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఆనంద్‌ ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోన్న నేపథ్యంలో సమాజానికి సరైన సందేశం ఇచ్చారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement