ఎయిర్‌టెల్ చేతికి వైటీఎస్ సొల్యూషన్స్ | Airtel to hand YTS Solutions | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్ చేతికి వైటీఎస్ సొల్యూషన్స్

Aug 4 2015 1:00 AM | Updated on Sep 3 2017 6:43 AM

ఎయిర్‌టెల్ చేతికి వైటీఎస్ సొల్యూషన్స్

ఎయిర్‌టెల్ చేతికి వైటీఎస్ సొల్యూషన్స్

ఫైనాన్షియల్ సొల్యూషన్స్‌ అందించే వైటీఎస్ సొల్యూషన్లను భారతీ ఎయిర్‌టెల్ కొనుగోలు చేసింది...

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సొల్యూషన్స్‌అందించే వైటీఎస్ సొల్యూషన్లను భారతీ ఎయిర్‌టెల్ కొనుగోలు చేసింది.  డీల్ విలువ తెలియలేదు. ఎయిర్‌టెల్ మనీ పేరుతో సేవలందించే తన మొబైల్ వాలెట్ సర్వీసుల విభాగం- ఎయిర్‌టెల్ ఎం కామర్స్ సర్వీసెస్ సీఈఓగా వైటీఎస్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మనీష్ ఖేరాను నియమించామని ఎయిర్‌టెల్ తెలిపింది. వైటీఎస్ సొల్యూషన్స్ బిజినెస్‌ను ఎయిర్‌టెల్ ఎం కామర్స్ సర్వీసెస్‌లో కలిపేస్తామని రెండూ సంస్థలూ వెల్లడించాయి.   ఎయిర్‌టెల్ సంస్థ 4,30,000 నగరాలు, పట్టణాల్లో 23 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలందిస్తోంది. ఎయిర్‌టెల్ మనీ చెల్లింపు బ్యాంక్ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement