 
													సాక్షి, ముంబై: యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) వాహనదారులకు చేదువార్త అందించింది. ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సోమవారం ప్రకటించింది. కమొడిటీ ధరలు పెరగిన నేపథ్యంలో కొన్ని మోడళ్ల వాహనాల ధరలను పెంచాలని భావిస్తున్నామని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ రాజన్ వధేరా ప్రకటించారు.
ప్యాసింజర్ వాహనాల ధరలను 30వేల రూపాయలు లేదా 2 శాతం పెంచాలని కంపెనీ భావిస్తున్నామన్నారు.  ఆగస్టు నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  దేశీయ మార్కెట్‌లో ఎక్స్‌యూవీ 500, స్కార్పియో, టీయూవీ 300,  కేయూవీ100 తదితర మోడళ్ల ప్యాసింజర్ వాహనాల శ్రేణిని ఎం అండ్ ఎం విక్రయిస్తుంది. కాగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించింది. 2.2 శాతం పెరిగిన ధరలు  ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నాయి. 
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
