షాకింగ్‌ తీర్పు: సన్‌టీవీ  షేర్లు జూమ్‌! | 2GScamVerdict: sun tv rally | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ తీర్పు: సన్‌టీవీ  షేర్లు జూమ్‌!

Dec 21 2017 11:09 AM | Updated on Dec 21 2017 5:43 PM

2GScamVerdict: sun tv rally - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద 2 జీస్కాం పై తీర్పు వెలువడిన  నేపథ్యంలో రియల్టీ షేర్లు  భారీగా ర్యాలీ అయ్యాయి.  2జీ కేసు  తీర్పుతో ఈ కేసుతో సంబంధం ఉన్న పలు కౌంటర్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి ముఖ్యంగా సన్‌టీవీ షేరు  6శాతం  ర్యాలీ అయింది. వీటితోపాటు యూనిటెక్‌, డీబీ తదితర రియాల్టీ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.  

2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలోని నిందితులందరినీ నిర్దోషులుగా  ప్రకటిస్తూ  గురువారం పటియాలా షాకింగ్‌ తీర్పు  చెప్పింది. ప్రాసిక్యూషన్‌ ఆరోపణలను నిరూపించలేకపోయిందని   కోర్టు తెలిపింది.   దీంతో కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న ఎ.రాజా, కనిమొళిసహా 17 మందిని నిర్దోషులుగా గుర్తిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.   ఈ సంచలన తీర్పుతో మాజీ టెలికాం మంత్రి ఏ.రాజా, కనిమొళికి భారీ ఊరట  లభించింది. అటు డీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement