ఏటా 100 ‘బిగ్‌ సి’ ఔట్‌లెట్లు

100 'Big C' Outlets annually - Sakshi

నూతన బ్రాండ్‌ లోగో ఆవిష్కరణ 

కొత్త అంబాసిడర్‌గా సమంత

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ ఏటా 100 ఔట్‌లెట్లను తెరవనుంది. ప్రస్తుతం కంపెనీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 225 స్టోర్లు ఉన్నాయి. సెప్టెంబరులో తమిళనాడులో ఎంట్రీ ఇస్తున్నట్టు సంస్థ ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి తెలిపారు. గురువారమిక్కడ బిగ్‌ సి కొత్త లోగో ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

కంపెనీ నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంత అక్కినేని వ్యవహరిస్తారని ప్రకటించారు. ‘2019 మార్చినాటికి 300 కేంద్రాల స్థాయికి చేరతాం. మూడేళ్లలో దక్షిణాదిన పూర్తి స్థాయిలో విస్తరించి, టాప్‌ రిటైలర్‌గా నిలవాలన్నది లక్ష్యం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అడుగుపెడతాం. 2017–18లో రూ.1,015 కోట్ల టర్నోవర్‌ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లు ఆశిస్తున్నాం. ప్రస్తుతం 2,500 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు’ అని వివరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top