గ్రహం అనుగ్రహం (14-05-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (14-05-2020)

Published Thu, May 14 2020 6:06 AM

Daily Horoscope in Telugu (14-05-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.సప్తమి ప.9.44 వరకు, తదుపరి అష్ఠమి నక్షత్రం శ్రవణం ఉ.9.18 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం. ప.1.33 నుంచి 3.15 వరకు, దుర్ముహూర్తం ప.9.48 నుంచి 10.40 వరకు, తిరిగి ప.2.56 నుంచి 3.46 వరకుఅమృతఘడియలు... రా.11.43 నుంచి 12.34 వరకు.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం    :  6.19
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

దినఫలాలు
మేషం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కవచ్చు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: కార్యక్రమాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.  శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. దేవాలయ దర్శనాలు.

మిథునం: అప్పులు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో విరోధాలు. కార్యక్రమాలు మ«ధ్యలోనే విరమిస్తారు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులు మరిన్ని బాధ్యతలు చేపడతారు.

కర్కాటకం: నూతన వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. ధనలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు.

సింహం: కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. స్నేహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు.  వ్యాపారులకు  నిరాశ. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు ఒత్తిడులు.

కన్య:అనుకున్న ఆదాయం సమకూరుతుంది. స్నేహితుల నుంచి శుభవార్తలు. దేవాలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

తుల: ఆప్తులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకోని  ఖర్చులు.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలు  చేపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి లాభ సూచనలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రోత్సాహం.

ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, బంధువులతో సమస్యలు పరిష్కారం. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు.

మకరం: ఆదాయానికి మించి ఖర్చులు. కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో విభేదాలు. వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులు నిరాశ. ఉద్యోగులకు పనిభారం.

కుంభం: బంధువుల నుంచి విమర్శలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా.  వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు. దూరప్రయాణాలు.

మీనం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. అదనపు రాబడి. ఆహ్వానాలు రాగలవు. దూరపు బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అనుకూలం.

Advertisement
Advertisement