గ్రహం అనుగ్రహం (13-07-2020) | Daily Horoscope in Telugu 13-07-2020 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (13-07-2020)

Jul 13 2020 5:50 AM | Updated on Jul 13 2020 9:26 AM

Daily Horoscope in Telugu 13-07-2020 - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఆషాఢ మాసం. తిథి బ.అష్టమి సా.4.34 వరకు, తదుపరి నవమి. నక్షత్రం రేవతి ఉ.10.45 వరకు, తదుపరి అశ్వని. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ప.12.31 నుంచి 1.23 వరకు, తిరిగి ప.3.08 నుంచి 4.01 వరకు. అమృత ఘడియలు తె.5.20 నుంచి 7.05 వరకు (తెల్లవారితే మంగళవారం) సూర్యోదయం: 5.36 సూర్యాస్తమయం: 6.35; రాహుకాలం:  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

గ్రహఫలం
మేషం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం:బంధువుల కలయిక. కుటుంబంలో ఆదరణ. కార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత అనుకూలత.

మిథునం: పనుల్లో పురోగతి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కర్కాటకం:పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం:ఉద్యోగ యత్నాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కన్య:కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. పనుల్లో విజయం. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో  సమస్యలు అధిగమిస్తారు.

తుల: రుణబాధలు తొలగుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. బంధువులను కలుసుకుంటారు.  ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృశ్చికం:ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అప్రయత్న కార్యసిద్ధి. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

ధనుస్సు: చేపట్టిన పనులు ముందుకు సాగవు. నిర్ణయాలు మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మకరం; కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. వాహనసౌఖ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు.

కుంభం: వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

మీనం:పనులు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement