‘అఖిలప్రియపై ఎలాంటి దాడి జరగలేదు’ | ysrcp workers not attacked on akhila priya, says ambati ramba | Sakshi
Sakshi News home page

‘అఖిలప్రియపై ఎలాంటి దాడి జరగలేదు’

Jan 19 2017 8:30 PM | Updated on Apr 4 2019 3:02 PM

‘అఖిలప్రియపై ఎలాంటి దాడి జరగలేదు’ - Sakshi

‘అఖిలప్రియపై ఎలాంటి దాడి జరగలేదు’

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై తమ పార్టీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారన్నది కల్పిత కథనమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.

గుంటూరు: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై తమ పార్టీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారన్నది కల్పిత కథనమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అఖిలప్రియ వాహనానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ ఎదురైన సమయంలో తాను అక్కడే ఉన్నానని, ఎలాంటి దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని చెప్పారు. వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే టీడీపీ దుర్మార్గపు ప్రచారానికి దిగిందని విమర్శించారు.

అఖిలప్రియ కంటే ముందు అదే దారిలో జూపూడి ప్రభాకర్‌ వెళ్లారని... అఖిలప్రియ వచ్చే సమయానికి అభిమానులు పెరగడంతో ఆమె తన కారును వెనక్కు తిప్పుకుని వెళ్లిపోయారని అంబటి రాంబాబు వివరించారు. అఖిలప్రియపై దాడి చేసేందుకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు యత్నించారని కొన్ని చానళ్లు ప్రసారం చేయడంతో ఆయన వివరణయిచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement