టీడీపీకి అభ్యర్థులే లేరు: పార్థసారథి | YSRCP MLA Parthasarathy Slams TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి అభ్యర్థులే లేరు: పార్థసారథి

Mar 13 2020 5:31 PM | Updated on Mar 13 2020 6:22 PM

YSRCP MLA Parthasarathy Slams TDP - Sakshi

సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ సహా అన్ని మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. టీడీపీకి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముందు ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని అన్నారు. డబ్బు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికల్లో గెలుస్తామని పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు.

చదవండి: ‘ఆయన లాంటి దద్దమ్మను ఎక్కడా చూడలేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement