మీరు చేస్తారా.. నన్నే చేయమంటారా? | Sakshi
Sakshi News home page

మీరు చేస్తారా.. నన్నే చేయమంటారా?

Published Sun, Aug 5 2018 7:46 AM

YSRCP MLA Kotamreddy Sridhar Reddy Fires on TDP Govt - Sakshi

నెల్లూరు సిటీ: బారాషహీద్‌ దర్గాలో మరుగుదొడ్లు, ఘాట్‌ నిర్మాణాలకు రూ.కోట్లు ఖర్చు చేశారు.. నిర్వహణ బాధ్యతలు గాలికొదిలేశారని, మరుగుదొడ్లు పరిశుభ్ర పరిచి ఉపయోగంలోకి తెస్తారా లేక తానే శుభ్రం చేయమంటారా అని నెల్లూరు రూరల్‌ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. నగరంలోని బారాషహీద్‌ దర్గా ఆవరణలోని మరుగుదొడ్లు, ఘాట్‌ పనుల్లో లోపాలను శనివారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషహీద్‌ దర్గా నెల్లూరుకు గర్వకారణమన్నారు. దేశవిదేశాల నుంచి భక్తులు బారాషహీద్‌ దర్గాను సందర్శిస్తుంటారని తెలిపారు.

 రూ.కోట్లు ఖర్చు చేసి మరుగుదొడ్లు, ఘాట్‌ నిర్మాణాలు చేపట్టి నిర్వహణ బాధ్యతలు గాలికొదిలేశారని మండిపడ్డారు. మరుగుదొడ్లులో నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు. తాను వస్తున్నానని తెలుసుకుని అప్పటికప్పుడు తూతూమంత్రంగా పైపై పనులు చేశారని పేర్కొన్నారు. ఘాట్‌ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6వ తేదీ ఉదయం 10 గంటలలోపు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలసి రాజకీయాలకు అతీతంగా గాంధీగిరి పద్ధతిలో  నిరసన తెలుపుతానన్నారు. అధికారులు స్పందించకపోతే తానే స్వయంగా శుభ్రం చేస్తానని చెప్పారు. 

మహిళా మరుగుదొడ్లు పక్కన మందు సీసాలు  ఉండటం గమనించిన ఎమ్మెల్యే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నెల్లూరులో భాగంగా పచ్చదనం పెంపొందిస్తామని గోడలపై రాతలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. బారాషహీద్‌ దర్గాలో చెట్లు ఎండిపోవడంపై ఇదే మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌లు చేస్తున్న స్వచ్ఛ నెల్లూరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తాటి వెంకటేశ్వరరావు, బొబ్బల శ్రీనివాసయాదవ్, అంజా హుస్సేన్, మాళెం సుధీకర్‌కుమార్‌రెడ్డి, ఎండీ అబ్దుల్‌ సలీమ్, డాక్టర్‌ స త్తార్, రియాజ్, మిద్దె మురళీకృష్ణయాదవ్, సందానీ బాషా, చిన్న మస్తాన్, అలీ నావాజ్, యాకసిరి శరత్‌చంద్ర, ఎం.శ్రీకాంత్‌రెడ్డి, టీవీఎస్‌ కమల్, రా మరాజు, మా దా బాబు, జగదీష్, సింహాచలం, మేఘనాధ్‌సింగ్, యనమల శ్రీహరియాదవ్, హ జరత్‌నాయుడు, తుమ్మల శీనయ్య, తాళ్లూరు సురేష్, కట్టా వెంకటరమణయ్య, ప చ్చారవి, మొయిళ్ల సురేష్, ఆండ్ర శ్రీనివాసులు, పేనేటి సుధాకర్, వే ల్పూలు అజ య్, గజరా నరేష్, కమల్‌రాజ్, హయద్‌ బాషా, పెద్ద మస్తాన్, తారీఖ్, మందాపెద్దబాబు, దిలీప్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement