వైఎస్సార్‌సీపీ మైనార్టీ అధ్యయన, ప్రచార కమిటీ | YSRCP Minority Committee | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మైనార్టీ అధ్యయన, ప్రచార కమిటీ

Jul 21 2018 8:56 PM | Updated on Aug 20 2018 6:07 PM

YSRCP Minority Committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌సీపీ మైనార్టీ అధ్యయన, ప్రచార కమిటీలో వివిధ పదవులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు కన్వీనర్‌, సభ్యులను నియమించినట్లు ఒక ప్రకటలో వెల్లడించారు. కన్వీనర్‌గా వి. ఖాధర్‌ భాషా( చిత్తూరు) నియమితులయ్యారు. సభ్యులుగా హబీబ్‌ అబ్దుల్‌ రహ్మాన్‌(హైదరాబాద్‌), షేక్‌ మొహమ్మద్‌ ఇక్బాల్‌(కర్నూలు), ఐ.హెచ్‌ ఫారూఖీ(విశాఖ పట్నం), సయ్యద్‌ షఫీ అహ్మద్‌ ఖాద్రీ(చిత్తూరు), బి.హెచ్‌. ఇలియాస్‌(కడప), షేక్‌ రఫి(నెల్లూరు), షేక్‌ మొహమ్మద్‌ రఫి(కడప), షేక్‌ జాన్‌ భాషా(తూర్పు గోదావరి), డి.యస్‌. హబీబుల్లా(కర్నూలు), షేక్‌ ఆసిఫ్‌(కృష్ణా), యూనిస్‌ పాషా( కృష్ణా), హంజా హుస్సేని(నెల్లూరు), గౌస్‌ లాజాం( కడప)లు నియమితులయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా షేక్‌ బెపారి ఎమ్మెల్యే అంజన్‌ భాషా(కడప), ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌(గుంటూరు), హైరేహల్‌ నదీం అహ్మద్‌( అనంతపురం), అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌(కర్నూలు) లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement