చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలి: జ్యోతుల నెహ్రూ | ysrcp leader jyothula nehru demands resignation of chandra babu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలి: జ్యోతుల నెహ్రూ

Dec 16 2014 4:51 PM | Updated on May 29 2018 4:18 PM

చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలి: జ్యోతుల నెహ్రూ - Sakshi

చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలి: జ్యోతుల నెహ్రూ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్నీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేర్చలేదని నెహ్రూ చెప్పారు.

రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన ఆయన.. ఇప్పుడు రుణాలు కట్టేసేయండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని అన్నారు. రైతులు రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారన్న విషయం చంద్రబాబుకు తెలియదా అని నెహ్రూ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement