పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి | Ysrcp former MLA gurnadha reddy arested | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి

May 3 2015 2:54 PM | Updated on Aug 21 2018 7:39 PM

పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి - Sakshi

పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలపై పోలీసుల వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

హైదరాబాద్: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలపై పోలీసుల వేధింపులు  కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బి. ప్రసాదరెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రసాదరెడ్డిని అప్పటికే అక్కడ మాటు వేసిన ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. అయితే ప్రసాదరెడ్డి హత్య అనంతరం జరిగిన అల్లర్లకు గుర్నాథరెడ్డే కారణమని పోలీసులు అభియోగాలు మోపారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి చందును పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement