సీఎం లోకేశా..? బాలయ్యా..? | ysrcp dharna in kurnool distirict | Sakshi
Sakshi News home page

సీఎం లోకేశా..? బాలయ్యా..?

Jun 9 2015 2:20 PM | Updated on Aug 10 2018 9:23 PM

సీఎం లోకేశా..? బాలయ్యా..? - Sakshi

సీఎం లోకేశా..? బాలయ్యా..?

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి ఆ పదవిలో కొనసాగే హక్కులేదని కావాలంటే బాలయ్యని కానీ, లేదా లోకేష్ బాబును కానీ నియమించుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు.

నంద్యాల : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి ఆ పదవిలో కొనసాగే హక్కులేదని కావాలంటే బాలయ్యని కానీ, లేదా లోకేష్ బాబును కానీ నియమించుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో సుమారు 3000 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు సీఎం పదవిలో కొనసాగడానికి అనర్హుడన్నారు. కావాలంటే ఆయన కొడుకు లోకేష్‌ ను గానీ లేకపోతే బాలకృష్ణను గానీ సీఎం పదవిలో కూర్చొబెట్టుకోవాలని సూచించారు. మీరు చేస్తే సంసారం మేం చేస్తే వ్యభిచారం అన్న చందంగా బాబు ప్రవర్తిస్తున్నాడని భూమానాగిరెడ్డి విమర్శించారు. స్వయానా పిల్లనిచ్చిన మామ స్వర్గీయ ఎన్టీఆరే  బాబు అవినీతి పరుడని చెప్పారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇన్ని రోజులు చంద్రబాబు రాజకీయాలు  సాగాయని ఇక సాగవని భూమా అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement