పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక వైఎస్ జగన్దే! | ysr congress party parliamentary party leaders meeting | Sakshi
Sakshi News home page

పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక వైఎస్ జగన్దే!

May 31 2014 2:29 PM | Updated on Jul 25 2018 4:09 PM

పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక వైఎస్ జగన్దే! - Sakshi

పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక వైఎస్ జగన్దే!

పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునే అధికారాన్ని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి అప్పగిస్తూ వైఎస్ఆర్ సీపీ ఎంపీలు శనివారమిక్కడ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ సమావేశం లోటస్ పాండ్లో ముగిసింది. పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునే అధికారాన్ని వైఎస్‌   జగన్‌మోహన్ రెడ్డికి అప్పగిస్తూ ఎంపీలు శనివారమిక్కడ ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్లమెంట్‌లో రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం అంశాలవారీగా ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని మేకపాటి రాజమోహన్‌ రెడ్డి చెప్పారు. ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగితే వ్యతిరేకిస్తామన్నారు.

పార్టీ ఎంపీలంతా సముచిత రీతిలో స్పందించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని మేకపాటి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా తప్పకుండా హాజరు కావాలని జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement