గవర్నర్ను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు | YSR Congress party leaders met governor Narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్ను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు

Sep 21 2013 12:53 PM | Updated on May 25 2018 9:10 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో శనివారం ఆయన నివాసమైన రాజభవన్లో భేటీ అయ్యారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో శనివారం ఆయన నివాసమైన రాజభవన్లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు ఈ సందర్బంగా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, అమర్నాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గొల్లబాబురావు, గుర్నాథరెడ్డి, బాలినేని, ప్రసన్నకుమార్ రెడ్డి, బాలరాజు, శ్రీనివాసులు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, దేవగుడి నారాయణరెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, మేక శేషుబాబు తదితరులు ఆ భేటీలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement