అదే స్పూర్తితో ముందుకు వెళ్లాలి: విజయమ్మ | YS Vijayamma calls party members to prepare for 2014 elections | Sakshi
Sakshi News home page

అదే స్పూర్తితో ముందుకు వెళ్లాలి: విజయమ్మ

Sep 21 2013 1:18 PM | Updated on May 25 2018 9:10 PM

అదే స్పూర్తితో ముందుకు వెళ్లాలి: విజయమ్మ - Sakshi

అదే స్పూర్తితో ముందుకు వెళ్లాలి: విజయమ్మ

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పుట్టి మూడేళ్లు పూర్తికాకుండానే... పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని... ఇదే స్పూర్తిని 2014 ఎన్నికల్లో కొనసాగించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పుట్టి మూడేళ్లు పూర్తికాకుండానే... పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని... ఇదే స్పూర్తిని 2014 ఎన్నికల్లో కొనసాగించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి దిగ్విజయంగా కొనసాగించిన పథకాలే స్ఫూర్తిగా ముందుకు సాగుతామన్నారు.

వైఎస్‌ఆర్‌ మూడు ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వైఎస్‌ విజయమ్మ అధ్యక్షత వహించారు. ఈ భేటికి పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర పాలక మండలి సభ్యులు, జిల్లా, మండల నేతలు హాజరయ్యారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్ సూచనల మేరకు.. వైఎస్‌ విజయమ్మ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement