'సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్' | YS Jaganmohan Reddy is most powerful leader, says ysr congress party leaders | Sakshi
Sakshi News home page

'సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్'

Mar 2 2014 1:24 PM | Updated on Aug 8 2018 5:41 PM

రాష్ట్రంలో ప్రస్తుత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని ఆ పార్టీ నాయకులు తోట చంద్రశేఖర్, ఆళ్ల నానిలు అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని ఆ పార్టీ నాయకులు తోట చంద్రశేఖర్, ఆళ్ల నానిలు అన్నారు. ఆదివారం ఏలూరులో తోట చంద్రశేఖర్, ఆళ్లనాని మాట్లాడుతూ... రాష్ట్రానికి బలమైన నాయకత్వం అవసరమని తెలిపారు. కేంద్రంతో తలపడి రాష్ట్రానికి అధిక నిధులు తీసుకురాగల సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్ ఒక్కడే అని వారు స్పష్టం చేశారు.

 

సోమ, మంగళవారాలలో పశ్చిమ గోదావరి జిల్లాలలో జగన్ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు చంద్రశేఖర్, ఆళ్లనానిలు పిలుపునిచ్చారు. జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలతోపాటు 8 మున్సిపాలిటీలు, ఓ కార్పోరేషన్ మేయర్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమన్నారు. రానున్న మున్సిపల్, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సిద్దంగా ఉన్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement