
శనివారం పాదయాత్రలో భాగంగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు..
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్ రోడ్ వద్ద 228వ రోజు పాదయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు.