నేడు జిల్లాకు జగన్ | ys jagan mohan reddy meets in jyotula Nehru | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు జగన్

Apr 1 2015 3:20 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ఆయన ఉదయం హైదరాబాద్

 జ్యోతుల కుటుంబానికి పరామర్శ
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ఆయన ఉదయం హైదరాబాద్ నుంచివిమానంలో బయలుదేరి రాజమండ్రి మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి జగ్గంపేట మీదుగా ఇర్రిపాకకు వెళ్తారు. సోదరుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇటీవల నెహ్రూ సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జ్యోతులను పరామర్శించిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి తుని మీదుగా విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం గోకులపాడు వెళ్తారు. అక్కడ ఇటీవల బాణసంచా పేలుడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement