జనసంద్రమైన విశాఖ నగరం | YS Jagan Mohan Reddy Meeting At Visakhapatnam | Sakshi
Sakshi News home page

జనసంద్రమైన విశాఖ నగరం

Sep 9 2018 4:22 PM | Updated on Sep 9 2018 4:53 PM

YS Jagan Mohan Reddy Meeting At Visakhapatnam - Sakshi

సభ ప్రాంగణమంతా జనంతో  నిండిపోవడంతో విశాఖ మహానగరం జనసంద్రమైంది...

సాక్షి, విశాఖపట్నం : వైస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ నగరానికి చేరింది. ఈ సందర్భంగా కంచరపాలెంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ అభిమానులు హాజరైయ్యారు. దీంతో సభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సభ ప్రాంగణమంతా జనంతో  నిండిపోవడంతో విశాఖ మహానగరం జనసంద్రమైంది. వైఎస్‌ జగన్‌ బహిరంగ సభకు నగరంలోని ప్రధాన జంక్షన్లల్లో ఎల్‌​ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం పలుకుతూ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహంచగా, గిరిజనలు వారి సాంప్రదాయ నృత్యాలతో జన నేతకు ఆహ్వానం పలికారు.  జగన్‌ బహిరంగ సభ సందర్భంగా విశాఖ మహానగరం వైఎస్సార్‌సీపీ జెండాలతో నిండిపోయింది. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు వారి అభిమానాన్ని చాటుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement