‘యాత్ర’ యూనిట్‌కు జగన్‌ శుభాకాంక్షలు | YS Jagan Mohan Reddy Congratulates Yatra Movie Team | Sakshi
Sakshi News home page

‘యాత్ర’ యూనిట్‌కు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Feb 10 2019 9:12 AM | Updated on Feb 10 2019 4:58 PM

YS Jagan Mohan Reddy Congratulates Yatra Movie Team - Sakshi

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మహానేత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని సినిమాగా తెరకెక్కించటంలో మీరు చూపించిన అభిరుచి, అంకిత భావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు’ అంటూ చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులను అభినందించారు.

మమ్ముట్టి, రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్‌ హిట్ టాక్‌ రావటంతో చిత్రయూనిట్‌ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement