
సాక్షి, ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు పర్యటన ఖరారైంది. అక్టోబర్ నెల 4న సీఎం జగన్ ఏలూరులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సమీక్ష నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ మరుసటి రోజు అక్టోబర్ 5న విజయవాడ దుర్గామాత అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు సమర్పిస్తారు.