నిశ్చితార్థం రోజే యువకుని ఆత్మహత్య | young man suiside | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం రోజే యువకుని ఆత్మహత్య

May 10 2015 4:30 AM | Updated on Sep 2 2018 5:06 PM

తల్లిదండ్రులు ఖాయంచేసిన పెళ్లి ఇష్టంలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తంగెడంచ(జూపాడుబంగ్లా) : తల్లిదండ్రులు ఖాయంచేసిన పెళ్లి ఇష్టంలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. పోలీసుల కథనం మేరకు..మండలంలోని తంగెడంచ గ్రామానికి చెందిన పుల్లమ్మ, డేవిడ్ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దవాడు ధన్‌రాజ్ లారీడ్రైవరు. ఇతనికి మండలంలోని 80బన్నూరు గ్రామానికి చెందిన ఓ యువతితో తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు.

శనివారం ధన్‌రాజ్ ఇంట్లో నిశ్చితార్థం చేసుకోవాల్సి ఉంది. ధన్‌రాజ్ తండ్రి డేవిడ్ గుత్తిలో జరిగే ప్రార్థనకు వెళ్లగా తల్లి పుల్లమ్మ, అన్నదమ్ములు, కుటుంబసభ్యులు భోజనం చేసి పడుకున్నారు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే ఉద్దేశంతో మనస్తాపానికి గురైన ధన్‌రాజ్ శుక్రవారం రాత్రి ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున కుటుంబసభ్యులు తులుపు తెరిచేందుకు యత్నిస్తే రాకలేదు. అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా ధన్‌రాజ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు.

కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించ సాగారు. ఎస్సై టి.సుబ్రమణ్యం తన సిబ్బందితో గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసునమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement