‘ఆయన ఏం పోస్టింగ్స్‌ పెట్టారో తెలియదు’ | yanamala ramkrishnudu respond on IYR krishnarao issue | Sakshi
Sakshi News home page

‘ఆయన ఏం పోస్టింగ్స్‌ పెట్టారో తెలియదు’

Jun 20 2017 7:46 PM | Updated on Aug 27 2018 8:44 PM

‘ఆయన ఏం పోస్టింగ్స్‌ పెట్టారో తెలియదు’ - Sakshi

‘ఆయన ఏం పోస్టింగ్స్‌ పెట్టారో తెలియదు’

ఐవైఆర్‌ కృష్ణారావు ఉదంతంపై ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు.

అమరావతి:  ఐవైఆర్‌ కృష్ణారావు ఉదంతంపై ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ... ఐవైఆర్‌ ఏం పోస్టింగ్‌లు పెట్టారో తనకు తెలియదన్నారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసం కాదని యనమల అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆరు నెలలుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నది తనకు తెలియదన్నారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఐవైఆర్‌ ఎక్కువ నిధులు అడిగారని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాదని చెప్పామన్నారు. అంతేకాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్‌లో ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారని, అయితే అందుకు తాము అంగీకరించలేదన్నారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారనే ఆరోపణలతో ఐవైఆర్‌ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర‍్మన్‌ పదవి నుంచి ఏపీ సర్కార్‌ తొలగించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణ కార్పొరేషన్‌ నూతన చైర్మన్‌గా వేమూరి ఆనంద సూర్యను నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement