హావభావాలకు అనుగుణంగా ఆత్మస్థైర్యం.. | Sakshi
Sakshi News home page

హావభావాలకు అనుగుణంగా ఆత్మస్థైర్యం..

Published Sat, Oct 6 2018 12:00 PM

World Smile Day Special Story - Sakshi

తిరుపతి అన్నమయ్య సర్కిల్, కల్చరల్‌: మారుతున్న కాలానికి అనుగుణంగా మనషుల మనస్తత్వాలు మారుతున్నాయి. ఒకనాడు అక్కా బాగున్నారా, అన్నా బాగున్నారా..? అని ఆప్యాయంగా పలకరించుకుంటూ జనం మధ్య సంబంధాలు మన అనుకునేంత.. దగ్గరగా కొనసాగేవి. అయితే ఆధునిక సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో పాటు మనుషుల మధ్య పలకరింపు సైతం  సరికొత్త స్మైల్‌.. స్టైల్‌గా మారింది. మాట నేర్చిన పిల్లాడి నుంచి చరమాంకంలోనున్న వృద్ధుల వరకు స్మైల్‌తో హాయ్‌ చెప్పడం స్టైల్‌గా మారింది. పట్టణాలలో ప్రారంభమైన ఈ స్టైల్‌ సంస్కృతి గ్రామీణ ప్రాంతాలకు సైతం వేగంగా విస్తరించింది. ఉదయం నిద్రలేచింది మొదలు తిరిగి నిద్రకు ఉపక్రమించే వరకు స్టైల్‌తో సంతరించుకున్న స్మైలే హాయ్‌ జీవన గమనమైంది. కనిపిస్తే చిరునవ్వుతో హాయ్‌ అనడమేకాక సమయానికి అనుగుణంగా గుడ్‌మార్కింగ్, గుడాఫ్టర్‌నూన్, గుడ్‌ ఈవెనింగ్, గుడ్‌ నైట్‌ అనే పదాలు స్మైల్‌తో వాటి హావభావాలు పలికిస్తున్నారు. మనుషులు ఎదురెదురుగా మాట్లాడుకునే విధానం దూరయ్యారు. ఇందుకు ప్రధాన కారణంగా సోషల్‌ మీడివేదికగా మారింది. కలిసి అప్యాయంగా పలకరించే సంస్కృతి దూరమైన సామాజిక మాద్యమాలతో కావాల్సిన వారి కి మెసేజ్‌ల ద్వారా స్మైల్‌ సింబల్స్‌నే వాడే పరి స్థితి నెలకొంది. దీంతో ఇద్దరు వ్యక్తులు కలిసి మ నస్ఫూర్తిగా పలకరించుకునే దుస్థితి కరువై వారి మధ్య  దూరాలు పెరుగుతున్నాయి. నేటి ఆధునిక జీవన విధానంలో మానవులు పోటీ తత్వానికి అలవాటు పడి సమయాభావం లేకుండా చిరునవ్వుతోనే పలకరింపులు ముగిస్తున్నాయి.

సజీవమైన నవ్వులు పెదవులపై తొణికిసలాడే వారే సంపూర్ణమైన ఆరోగ్యవంతులు, ఆకర్షణీయులు.. నవ్వు నాలుగు విధానాల మేలు అనే సామెతకు ఇదే తార్కాణం... నవ్వడం ఒక భో గం..., నవ్వించడం  ఓ యోగం..., నవ్వలేకపోవడం  ఓ రోగం... ప్రపంచంలోని కోటాను కోట్ల జీవరాసులలో పరిపూర్ణంగా నవ్వకలిగే శక్తి ఒక మానవునికే ఉంది. ప్రతి మనిషి నిత్యం ఉత్సాహంగా,  ఉల్లాస  జీవనంతో  దీర్ఘకాలిక ఆరోగ్యం తో బతికించే దివ్య ఔషధం నవ్వు. అంతేకాదు పైసా ఖర్చు లేకుండా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పంచే అద్భుతమైన  ఔషధం నవ్వు. నవరసాల్లో హాస్యం ఒకటి. మనుషుల మధ్య బంధాలను పెంచడంలోనూ, పదుగురిని దరి చేర్చడంలోను ఎంతో ఉపకరించి  ఆనందాన్ని పంచే అమృతం లాంటిది చిరునవ్వు. ప్రతి మనిషి ఆరోగ్యాన్ని, ఆయుష్సును రెట్టింపు చేసి సమాజంలో గుర్తింపునిచ్చేది ఈ నవ్వే. అంతటి మహత్యం కలిగిన ఈ నవ్వుకు నేటి ఆధునిక సమాజం కొత్త భాష్యానిస్తోంది. అనేక హావభావాలతో చిరునవ్వే సమాధానంగా వివిధ రూపాలలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత వేగవంతమైన సమాజం, ఉరుకుపరుగుల జీవితం, కొత్త సంభాషణలతో చతురోక్తులు, చలోక్తులతో సమాజం నడుస్తోంది.

చిరునవ్వుతో లాభాలెన్నో..
రోజు కొద్ది సేపు నవ్వే వారిలో  రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఊపిరితిత్తులు, గుండె సామర్థ్యం పెరుగు పడుతుంది. ఆస్తమా, బీపీ, షుగర్, మానసిక  రోగులకు నవ్వు ఎంతో  ఉపసమనం ఇస్తుంది. శ్వాస కోశ వ్యవస్థలోని పొరలు నవ్వుతో మెరుగుపరుస్తుంది.  నవ్విన వారి శరీరంలో టిసెల్స్‌ శాతం అధికంగా విడుదలై నీరసం నిసత్తువ తగ్గుముఖం పడతాయి. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం చేకూరుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యమంటే నవ్వు అని అర్థం.

సోషల్‌ మీడియాలో..
నేటి యువత అధికంగా స్మార్ట్‌ ఫోన్లతో సామాజిక మాధ్యమాలలో స్మైల్‌తోనే ఉత్తర ప్రత్తుత్తరాలు జరుపుతున్నారు. ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు భాగా మృగ్యమైపోతున్నాయి. నేటి సాంకేతిక ప్రగతి మనుషుల్ని క్రమంగా దూరం చేస్తోంది. సామాజిక మాధ్యమాల రాకతో మనస్ఫూర్తిగా పలకించే వారే కరవయ్యారు. భార్య భర్తలు ఎదురెదురుగా ఉన్నా సామాజిక మాధ్యమాలతోనే పలకరించుకుంటూ స్వచ్ఛమైన నవ్వుకు దూరం అవుతున్నారు. ఈ విపరీత ధోరణికి కారణం కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలను గుర్తించపోవడమే.– డాక్టర్‌ ఎన్‌బీ.సుధాకర్‌రెడ్డి, ప్రముఖ సైకాలజిస్ట్, తిరుపతి

విజేతలు..
ఒక్క చిరునవ్వు.. వెయ్యి సమస్యలను పరి ష్కస్తుంది. వంద విజయాలను దరి చేరుస్తుంది. అది ఓ కార్పొరేట్‌ సంస్థ ఉద్యోగి అయినా.. పారిశ్రామిక వేత్తయినా, వ్యాపా రి అయినా కష్టాన్ని మరిపించి.. మానసిక ఆందోళనను దూరం చేసేది చిరునవ్వే. ఇదే విజయానికి బాటలు పరుస్తుంది.

స్మేహితుడు..
ఏ కల్మషం లేనిది స్మేహమొక్కటే. తనలో ఎన్ని భావాలున్నా.. వాటన్నింటినీ తొక్కిపెట్టి ఆత్మీయుడికి ఆనందాన్ని పంచేది చిరునవ్వు ఒక్కటే. ఎలాంటి ఆర్థిక తోడ్పాటు లేకుండా.. అరమరికలను దూరం చేసే శక్తి చిరునవ్వేకే ఉందంటే అతిశయోక్తి కాదేమో.

సామాజిక మాధ్యమాలు..
రోజు ప్రారంభం నుంచి.. పూర్తయ్యే వరకు.. గుడ్‌ మార్నింగ్, గుడ్‌ నైట్‌..కు పట్టే ఫొటోలన్నీ చిరునవ్వుకు ప్రతిరూపాలే. పచ్చని ప్రకృతి, పూలతోట, పక్షుల కిలకిలా రావాలను తెలియజేసే ఆడియోలు.. ఇవ న్నీ.. హాయ్‌ చెప్పేందుకు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఉపయోగిస్తున్నారు.

Advertisement
Advertisement