‘సీఎం గారూ.. న్యాయం చేయండి’ 

Women Show Placard To CM YS Jagan In Vijayawada - Sakshi

రాజ్‌భవన్‌ వద్ద ప్లకార్డు చేతబూని వేడుకున్న మహిళ 

తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి

సాక్షి, అమరావతి బ్యూరో: రాజ్‌భవన్‌ వద్ద పద్మావతి అనే మహిళ ‘సీఎం గారూ.. న్యాయం చేయండి’ అని రాసిన ప్లకార్డును చేతబూని ఉండటాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆమె నుంచి వివరాలు అడిగి తెలుసుకుని తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యేందుకు సోమవారం వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల కోసం మీడియా ప్రతినిధులు ఆమెను సంప్రదించగా.. తన సోదరి కుమారుడు మనోజ్‌కుమార్‌ సెప్టెంబర్ 21న హత్యకు గురయ్యాడని తెలిపింది. స్నేహితులే హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పింది. ఈ విషయమై విజయవాడ డీసీపీ విక్రాంత్‌ స్పందిస్తూ.. కేసు దర్యాప్తులో ఉందని, కుటుంబ సభ్యుల అనుమానాలపైనా విచారణ జరిపిస్తామన్నారు. ఎస్‌ఐ పాత్రపై కూడా విచారణ జరిపిస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top