ఎయిరిండియా గురించి ప్రధానితో చర్చిస్తా: అశోక్ | Will discuss Air India issue with PM: Civil aviation minister | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా గురించి ప్రధానితో చర్చిస్తా: అశోక్

May 29 2014 12:24 PM | Updated on Aug 15 2018 2:20 PM

ఎయిరిండియా గురించి ప్రధానితో చర్చిస్తా: అశోక్ - Sakshi

ఎయిరిండియా గురించి ప్రధానితో చర్చిస్తా: అశోక్

ఎయిరిండియాను పునరుద్ధరించే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీతో చర్చిస్తానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు.

ఎయిరిండియాను పునరుద్ధరించే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీతో చర్చిస్తానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు. తన మంత్రిత్వశాఖ ప్రధాన కార్యాలయమైన రాజీవ్ గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎయిరిండియాకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో విశ్లేషించాలని, పోటీ వల్లేనా.. మరేదైనా కారణం ఉందా అన్నది తెలుసుకోవాలని ఆయన అన్నారు.

ఎయిరిండియా ఇటీవలే నష్టాల నుంచి కొద్దిమేర బయటపడి లాభనష్టాలు లేని పరిస్థితిలోకి చేరుకుంది. మొత్తం ఎయిరిండియా ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని రాజు చెప్పారు. జెట్ ఇంధనాన్ని నేరుగా దిగుమతి చేసుకోవడానికి అనుమతించడం లాంటి సంస్కరణలు కొన్ని చేపట్టినా, విమానయాన పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. కొన్ని వివాదాలున్నా, వాటిని తాను అప్పుడే ప్రస్తావించబోనని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement