ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త విడిచిపెట్టడంతో ఆమె న్యాయం పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం
కొమరాడ/పార్వతీపురం: ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త విడిచిపెట్టడంతో ఆమె న్యాయం పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం తన భర్త పోలా సోమేశ్వరరావు ఇంటి వద్ద అతని భార్య రజని ఆందోళన చేపట్టంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జియ్యమ్మవలస మండలం వనిజ గ్రామానికి చెందిన తనను కోదులగుంప గ్రామానికి చెందిన పోలా సోమేశ్వరరావు ఆరేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రస్తుతం తమకు నాలుగేళ్ల రాహుల్, ఏడాదిన్నర కుమార్తె సునంద ఉన్నారని, ఏడాదిగా తన భర్త తమను పట్టించుకోకుండా విడిచిపెట్టారని చెప్పారు. భర్త తీరుపై కోదులగుంప గ్రామపెద్దలకు పలుమార్లు తెలియజేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కొమరాడ, పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, ఈ సారి న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి కదలనని స్పష్టం చేసింది.
విలేకరులపై దాడులు
రజని న్యాయ పోరాటం చేస్తుందన్న విషయం తెలుసుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియూ సిబ్బంది గ్రామానికి చేరుకుని రజనీతో మాట్లాడుతుండగా, ఒక్కసారిగా సోమేశ్వరరావు కుటుంబ సభ్యులు దాడి చేశారు. విలేకరుల కెమారాలు లాక్కొని పగులగొట్టారు. ఈ క్రమంలో రజనీని కూడా చితకబాదారు. దీంతో రజిని పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్వతీపురం వచ్చింది.
దాడి చేశారు
పార్వతీపురం పోలీస్టేషన్‌కు చేరుకున్న తర్వాత బాధితురాలు రజనీ మాట్లాడుతూ, తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి వద్దకు వెళితే అత్త అప్పలనరసమ్మ, మామ అప్పలనాయుడు, బావ మౌళి, మరదలు దేవి లతోపాటు గ్రామానికి చెందిన వాన మన్మధ, మౌళి, బూరి బుజ్జి, ఉమ తదితరులు దాడిచేశారని భోరుమంది. జాకెట్,చీర చింపేసి దారుణంగా కొట్టారని కన్నీటిపర్యంతమైంది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.