రాష్ట్ర విభజన జరిగితే కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు ఎవరిస్తారు? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ప్రశ్నించారు.
విజయవాడ: రాష్ట్ర విభజన జరిగితే కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు ఎవరిస్తారు? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ప్రశ్నించారు. నూజివీడులో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజనతో హైదరాబాద్‌పై సీమాంధ్రులకు హక్కు ఉండదని చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి, 10 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని తెలిపారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు 500 కోట్ల రూపాయల ప్యాకేజి కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. విభజన జరిగితే పోలవరం నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే కాంగ్రెస్ విభజన చేస్తోందని విమర్శించారు. విభజనను అడ్డుకునే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి మాత్రమేనని చంద్రశేఖర్ అన్నారు.