గొంతులో ఉన్నదేమిటి? | What is in the throat? | Sakshi
Sakshi News home page

గొంతులో ఉన్నదేమిటి?

Jun 17 2016 2:12 AM | Updated on Apr 3 2019 8:28 PM

ఏఎస్పీ శశికుమార్ మృతిలో సంచలనం కలిగించే అత్యంత కీలక ఆధారం ‘సాక్షి’ సేకరించింది.

‘సాక్షి’ చేతికి శశికుమార్ పుర్రె ఎక్స్‌రే
గొంతులో కనిపిస్తున్న బంతిలాంటి వస్తువు

 

విశాఖపట్నం: ఏఎస్పీ శశికుమార్ మృతిలో సంచలనం కలిగించే అత్యంత కీలక ఆధారం ‘సాక్షి’ సేకరించింది.  శశికుమార్‌ని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనేందుకు బలం చేకూర్చే ప్రధాన సాక్ష్యంగా మారే అవ కాశం ఉంది. అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు ఏదో రహస్యాన్ని దాస్తున్నారని ముందే పసిగట్టిన ‘సాక్షి’ ఆ దిశగా అడుగులు వేసింది. అత్యంత లోతుగా చేసిన పరిశోధనలో శశికుమార్ పుర్రె ఎక్స్‌రేలు సంపాదించింది. శవ పరీక్షకు ముందు ఫోరెన్సిక్ నిఫుణులు శశికుమార్ మృతదేహంపై గాయాలను పరిశీలించారు. అతని తలపై గాయం ఉండటంతో పుర్రెను ఎక్స్‌రే తీయించారు. సాధారణంగా శవ పరీక్షలకు ముందు ఎక్స్‌రే తీసే సంప్రదాయాన్ని ఫోరెన్సిక్ వైద్యులు పెద్దగా పట్టించుకోరు.


కానీ శశికుమార్ మరణం అనుమానాస్పదం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా  ఎక్స్‌రే తీశారు. దీన్ని చూసిన తరువాత మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి . శశికుమార్ కంఠముడి(గొంతు)లో ఒక బంతి వంటి వస్తువేదో ఉన్నట్లు ఈ ఎక్స్‌రేలో స్పష్టంగా కనిపిస్తోంది. అతను చనిపోవడానికి ముందు మాట బయటకు రాకుండా ఆ వస్తువును గొంతులో కుక్కినట్లు అనిపిస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. రిపోర్ట్‌ను రహస్యంగా నమోదు చేశారు. అదే విధంగా శశికుమార్ పుర్రెపై అనేక పగుళ్లు ఉన్నట్లు ఎక్స్‌రేలో వెలుగుచూసింది. బుల్లెట్ వల్లే అలా జరిగిందా లేక తలపై వేరే బలమైన ఆయుధంతో కొట్టడం వల్ల పుర్రె పగిలిందా అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement