కొనసాగుతోన్న వాయుగుండం

Weather News From Visakapatnam Weather Center  - Sakshi

విశాఖపట్నం జిల్లా: జంషెడ్‌పూర్‌ పరిసర ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోందని  విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయిగుండం పశ్చిమ వాయివ్య దిశగా పయనిస్తూ మరో 24 గంటల పాటు కొనసాగనుంది. క్రమణా బలహీన పడి రేపటికి(సోమవారానికి) తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది.

ద్రోణి ప్రభావంతో కోస్తాలో చెదురుముదురు వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 50కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ముప్పు లేకపోవడంతో పోర్టు హెచ్చరికలను విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఉపసంహరించుకుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top