నీటి యుద్ధం మొదలు! | water war start ! | Sakshi
Sakshi News home page

నీటి యుద్ధం మొదలు!

Oct 29 2014 4:37 PM | Updated on Sep 2 2017 3:34 PM

నీటి యుద్ధం మొదలు!

నీటి యుద్ధం మొదలు!

రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం మొదలైంది.

 హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం మొదలైంది. కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం వాడివేడిగా జరుగుతోంది. శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని ఏపి అధికారులు పట్టుబడుతున్నారు. 834 అడుగులే ఉండాలని తెలంగాణ అధికారులు వాదిస్తున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటి విడుదల ఆపాలని కూడా తెలంగాణ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ సమావేశానికి కెఆర్ఎంబి చైర్మన్ ఎస్‌కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో అజెండాలోని 9 అంశాలపై చర్చిస్తున్నారు.  శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిపైన, బోర్డు అధికారులకు కార్యాలయాల కేటాయింపు, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలపై కూడా చర్చిస్తారు.
**

Advertisement
 
Advertisement
Advertisement