నేనున్నానని | vishnuvardhan death in Samaikyandhra Movement Financial assistance :ysr congress party leaders | Sakshi
Sakshi News home page

నేనున్నానని

Jan 13 2014 1:54 AM | Updated on Sep 2 2017 2:34 AM

పట్టణంలోని డబ్బీవీధికి చెందిన యడ్ల విష్ణువర్థన్ (12) కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ అరుకు పార్లమెంట్ సమన్వయకర్త

 సాలూరు, న్యూస్‌లైన్ : పట్టణంలోని డబ్బీవీధికి చెందిన యడ్ల విష్ణువర్థన్ (12) కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ అరుకు పార్లమెంట్ సమన్వయకర్త కొత్తపల్లి గీత ఆదివారం రూ. 20 వేలు ఆర్థిక సహా యం అందజేశారు. గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆ వీధి యువకులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మను ఊరేగించి, స్థానికంగా ఉన్న చెరువులో దహన సంస్కారాలు చేస్తుండడంగా విష్ణువర్థన్ (12) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. అప్పట్లో బాలుడి కుటుంబాన్ని ఆదుకుం టామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్ సీపీ నాయకులు స్పందించారు. 
 
 ఈ మేరకు ఆదివా రం ఆ బాలుడి తల్లిదండ్రులు యడ్ల శ్రీను, లక్ష్మికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే వారి ఇద్దరి కుమార్తెలు గాయత్రి, గీత చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వారికి ప్రత్యేకంగా బ్యాంకులో అకౌంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ కష్టమొచ్చినా నేరుగా తమను కలవవచ్చునన్నారు. అంతకుముందు పార్టీ నాయకులు బాలుడి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జరజాపు సూరిబాబు, గరుడబిల్లి ప్రశాంత్‌కుమా ర్, మంచాల వెంకటరమణ, డొల బాబ్జీ, వైకుంఠపు మధు, రెడ్డి సన్యాసినాయుడు, మాజీ ఎంపీపీ తీళ్ళ సుశీల, పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement