హెచ్‌ఐవీలో విశాఖ @ 9

Visakhapatnam ninth Place in HIV Aids - Sakshi

గత ఏడాది హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో జిల్లాకు నాలుగో స్థానం

ఇప్పుడది తొమ్మిదికి మార్పు

ప్రజల్లో పెరిగిన అవగాహనే కారణం

సత్ఫలితాలిస్తున్న ప్రచారం

తగ్గుతున్న హెచ్‌ఐవీ కేసులు : విశాఖ జిల్లాలో 2014 నుంంచి 2018 వరకూ హెచ్‌ఐవీ కేసుల తీరు తెన్నులు పరిశీలిస్తే.. ఏటేటా గణనీయంగాతగ్గుతున్నాయి. 2014లో 98,169 మందిని పరీక్షిస్తే 2464 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. 2015–166లో 96081 మంందికి పరీక్షలు చేయగా 2,180 కేసులు నమోదయ్యాయి. హెచ్‌ఐవీ కేసులు 2007 నుంచి  క్రమేపీ తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత ఏడాది 1,03,616 మందిని పరీక్షించగా 2,017 మందికి , ఈ ఏడాది ఇప్పటిదాకా 63,325 మందికి పరీక్షలు చేయగా 1,046 మందికి పాజిటివ్‌గా తేలింది. దీనిని బట్టి గడచిన 10 ఏళ్ల నుంచి చూస్తే హెచ్‌ఐవీని పరీక్షించుకునే వారి సంంఖ్య పెరుగుతుంండగా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్టుస్పష్టమవుతోంది.

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పులిరాజాకు ఎయిడ్స్‌ వస్తుందా?.. ఒకప్పుడు విస్తృతంగా జరిగిన ప్రచారం ఇది. ఉత్కంఠను రేకెత్తించడమే కాదు, ఉపద్రవంలా మారిన ఎయిడ్స్‌/ హెచ్‌ఐవీపై అవగాహన పెంపొందించడానికి దోహదపడిన ప్రచారం ఇది. కొన్నేళ్లుగా ఈ ప్రచార జోరు కనబడనంతగా తగ్గింది. ఇంతకూ జనాలను మహమ్మారిలా హడలెత్తించిన ఈ పులి విశాఖ జిల్లాలో క్రమంగా తన ఉనికి కోల్పోతోంది. గత ఏడాది  ఎయిడ్స్‌/ హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో జిల్లా 4వ స్థానంలో ఉండగా..ఈ ఏడాది 9వ స్థానానికి మారింది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కల్పించిన అవగాహన సత్ఫాలితాలను ఇచ్చింది.

ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకూ...
ఈ ఏడాది ఏప్రిల్‌ æనుంచి అక్టోబర్‌ వరకూ జిల్లా ఆస్ప?త్రుల్లో హైఐవీ పరీక్షలు చేయించుకోగా..వారిలో 1,046 మందికి హెచ్‌ఐవీఉన్నట్టు నిర్ధారణ అయింది. జిల్లాలో హెచ్‌ఐవీ సోకిన వారి కోసం నాలుగు యాంటీ రెట్రో వైరల్‌æ చికిత్సా కేంద్రాలు ఉన్నాయి. వీరిలో32,790 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఎయిడ్‌ బారిన పడిన సుమారు 2,500 మంది బాధితులు పింఛన్లు పొందుతున్నారు.

ఏఆర్‌టీ సెంటర్లలో నమోదైనవారు
హెచ్‌ఐవీ ఉండి యాంటీ రిట్రో వైరల్‌æ మందుల కోసంం ఏఆర్‌టీ సెంటరులో మొత్తం 32,790 మంది నమోదు చేయించుకున్నారు. వారిలో 16,890 పురుషులు, 14621 స్త్రీలు. మగ పిల్లలు 661, ఆడపిల్లలు 522 మంది. హెచ్‌ఐవీ ఉండి యాంటీ రిట్రోవైరల్‌ నివారణ మందులు (ఏఆర్‌టీ) వాడుతున్నావారు మొత్తం 15,495 మంది ఉండగా..వారిలో 6,822 పురుషులు, 8047 మంది స్త్రీలు, మగ పిల్లలు 335, ఆడ పిల్లలు 259 మంది వున్నారు.

హెచ్‌ఐవి స్థితిని తెలుసుకోండి
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా మీ హెచ్‌ఐవీ స్థితిని తెలుసుకోండి అనే కొత్త నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య–ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌.తిరుపతిరావు వెల్లడించారు. రేసపువానిపాలెంలో గల సంస్థ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్తగా ఎవరినీ హెచ్‌ఐవీ బారిన పడకుండా చేయడం, హెచ్‌ఐవీ సోకిన వారిని వివక్ష లేకుండా సామూహికంగా కలుపుకుని పోవడం అన్నవి ప్రధాన అంశాలుగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సంయుక్తంగా ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు.  ఈ ఏడాది జూన్‌ ఒకటి నుంచి జూన్‌ 30 వరకు తల్లిబిడ్డ రక్ష కార్యక్రమం ద్వారా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించామన్నారు. జిల్లాలో సుమారుగా 3వేలమంది ఎయిడ్స్‌ రోగులు కేజీహెచ్, టీబీ ఆస్పత్రి, అనకాపల్లి, నర్సీపట్నం ఆస్పత్రుల ద్వారా ఏఆర్‌టీ మందులు పొందుతున్నారన్నారు. జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌సొసైటీ అధికారి డాక్టర్‌ ఆర్‌.రమేష్‌ మాట్లాడుతూ, డిసెంబర్‌ ఒకటవ తేదీన ఉదయం 9 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఏయూ వరకు భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. మీడియా సమావేశంలో జిల్లావైద్య–ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు.  

నేడు జీవీఎంసీ నుంచి ఏయూ వరకూ ర్యాలీ :నివారణ చర్యలు ముమ్మరం
ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణలో భాగంంగా ఈ ఏడాది వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆరోగ్యసంస్థ మార్గదర్శకాల ప్రకారం సీడీ 4పరీక్షతో నిమిత్తంం లేకుంండా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ పాజిటివ్‌  అని నిర్ధారణ అయిన వెంంటనే ఎఆర్‌టీ చికిత్స ప్రారంభించడంం జరుగుతుంది. రక్తసేకరణ, రవాణా వాహనం ద్వారా స్వచ్ఛంద రక్త దానశాతాన్ని పెంచి, రక్తకొరత లేకుండా చేయడం, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారికి ఎన్టీఆర్‌భరోసా ద్వారా జిల్లాలో 4వేలకు పైగా మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. ఏపీ బ్లడ్‌ సెల్‌æ యాప్‌ ద్వారా బ్లడ్‌బ్యాంక్, రక్తనిల్వలు వివరాలు తెలుసుకోవచ్చు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌తో జీవిస్తున్న 137 మంది గిరిజనులకు పంచామృతం కార్యక్రమంం ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు.– డాక్టర్‌ ఆర్‌.రమేష్, జిల్లా ఎయిడ్స్‌ నివారణ,నియంత్రణ విభాగం అధికారి, విశాఖపట్నం.

వివిధ సంస్థల సహకారంతో..
ప్రస్తుత కాలంలో ప్రజల జీవన శైలి ఎయిడ్స్‌ వ్యాప్తికి దోహదం చేస్తోంది. నైతికపరమైన విలువలతో కూడిన జీవన విధానం ద్వారానే ఈ వ్యాధి నియంంత్రణ సాధ్యపడుతుంది. ముఖ్యంంగా హెచ్‌ఐవీపై అవగాహన కల్పించేందుకు పలు సంస్థల సహకారంతో నెలకు మూడు సమావేశాలు ఏరా ?టు చేస్తున్నాం. అసలు వ్యాధి రాకుండానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం.
– డాక్టర్‌ ఎస్‌.తిరుపతిరావు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,విశాఖ.

9వ స్థానంలో విశాఖ
ఆరోగ్యసంస్థ సర్వే ప్రకారం భారతదేశంలో ఎయిడ్స్‌వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏమైనా ఉందంటే..అది ఆంధ్రప్రదేశే. ఎయిడ్స్‌పై అవగాహన లోపించడం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలదే. 1981లో తొలిసారిగా ఎయిడ్స్‌ను కనుగొన్నప్పుడు కేవలం నలుగురికి మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 36.9 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. బిల్‌æగేట్, క్లింటన్‌ ఫౌండేషన్ల నుంచి నిధులు వచ్చినంంత కాలం ఎయిడ్స్‌ నివారణకు విస్తత ప్రచారాలు చేసిన రెండు ప్రభుత్వాలు, ఆ నిధులు ఆగిపోవడంంతో ప్రచారాన్ని, అవగాహన కార్యక్రమాలను గాలికొదిలేశాయి.– కూటికుప్పల సూర్యారావు, ప్రముఖ వైద్యుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top