వాహనం సహా గంజాయి స్వాదీనం | Sakshi
Sakshi News home page

వాహనం సహా గంజాయి స్వాదీనం

Published Tue, Oct 21 2014 2:20 AM

Vehicle, including the marijuana confiscated

పుత్తూరు :  పుత్తూరు మండల పరిధిలోని వేపగుంట రైల్వే గేటు వద్ద సోమవారం మధ్యాహ్నం కారులో అక్రమంగా గంజారుు రవాణాచేస్తున్న ఇద్దరు తమిళనాడువాసులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కారుసహా 15లక్షల విలువజేసే 300కిలోల గంజారుుని స్వాధీనంచేసుకున్నారు. ఈ వివరాలను పుత్తూరు డీఎస్పీ నాగభూషణరావు విలేకరులకు వెల్లడించారు. తమిళనాడులోని మదురై జిల్లాకు చెందిన కలై అనే వ్యక్తి  ఎస్.ప్రసన్నపాం డి, టి.మహాళింగంతో కలసి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చేరుకున్నారు.

అక్కడి నుంచి టీఎన్‌యూ 5878 అనే ఫోర్డ్ ఐకాన్ వాహనంలో గంజాయి సంచులు నింపుకుని ప్రసన్నపాండి, మహాళింగం తమిళనాడుకు బయలుదేరారు. వారు పుత్తూరు మండలం వేపగుంట మీదుగా పల్లిపట్టుకు వెళుతున్నట్లు పుత్తూరు సీఐ చంద్రశేఖర్‌కు సమాచారం అందింది. ఎస్‌ఐలు రామాంజనేయులు, నాగన్న, ఏఎస్‌ఐలు నరసింహులు, రవితో పాటు సిబ్బందిని ఆయన అప్రమత్తం చేశారు. వారు అక్కడికి చేరుకుని వాహనాన్ని తనిఖీచేయగా 16 సంచుల్లో గంజాయి ఉంది.

దాని బరువు 300 కిలోలు, విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. గంజారుుని అక్రమ రవాణా చేస్తున్న ఎస్.ప్రసన్నపాండి, టి.మహాళింగాన్ని అరెస్టు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. గంజాయి రవాణా లో ప్రధాన సూత్రధారి కలై అని, అతను వాహనంలో రాకుం డా రైలులో మధురై వెళ్లినట్లు డీఎస్పీ చెప్పారు.
 
అనంతపురం బస్సులో గంజాయి స్వాధీనం : మరో ఇద్దరి అరెస్ట్

ములకలచెరువు: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అనంతపురం జిల్లాకు చెందిన వారు. ములకచెరువు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి కథనం మేరకు అనంతపురం జిల్లా కొక్కంటిక్రాస్ నుంచి ఆర్టీసీ బస్సులో ఇద్దరు గంజాయితో బయలుదేరారని అనంతపురం జిల్లా తనకల్లు పోలీసు స్టేషన్ నుంచి సమాచారం అందింది.

ములకలచెరువు ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బం దితో బస్సులో తనిఖీలుచేశారు. బస్సులో ప్రయాణిస్తున్న రహంతుల్లా (45), జహారా (36)ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని తనకల్లు పోలీసులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. వారిద్దరూ అనంతపురం జిల్లా బాలసముద్రం పంచాయతీ, మారెప్పగారిపల్లెకు చెందిన వారని ఎస్‌ఐ తెలిపారు. వారు తమిళనాడు రాష్ట్రం వేలూరుకు గంజాయి తీసుకుని వెళుతునట్లు ఆయన వివరించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement